లవర్స్ డే  క్లైమాక్స్ మారింది 

23 Feb,2019

హీరోయిన్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నటించిన మలయాళ చిత్రం 'ఒరు ఆధార్‌ లవ్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో 'లవర్స్‌ డే' పేరుతో సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సమర్పణలో సుఖీభవ సినిమాస్‌ సంస్థ ద్వార ఎ.గురురాజ్‌ విడుదలచేశారు. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు షాన్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. వాలెంటైన్స్‌ డే కానుకగా ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో విడుదలై మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఎ. గురురాజ్‌ మాట్లాడుతూ - '' మాది మధ్యతరగతి కుటుంబం. నేను నటుడ్ని కావాలనే కోరికతో సినిమా రంగానికి రావడం జరిగింది. కానీ అప్పట్లో అవకాశం, అదృష్టం లేక నటుడ్ని కాలేకపోయాను. ఆ తరువాత రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చి సుఖీభవ ప్రాపర్టీస్‌ సంస్థను స్థాపించి అంచలంచెలుగా ఎదిగి రియల్‌ఎస్టేట్‌ రంగంలో మంచి పేరుప్రఖ్యాతలతో పాటు మంచిస్థాయిని సంపాదించుకున్నాను. అయినప్పటికీ నాకు సినిమా ఇండస్ట్రీపై ఉన్న ఫ్యాషన్‌తో చాలా సినిమాలకు గెలుపోటములతో సంబంధం లేకుండా నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నాను. దర్శకుడు ఒమర్‌ లులు కొత్తవారి ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఎప్పుడూ కొత్తవారితోనే సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. అలాగే 'లవర్స్‌డే' సినిమాకు కూడా అంతా కొత్తవారినే తీసుకొని కూడా వారితో ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్‌ ఆర్టిస్టుల్లా పెర్ఫామ్‌ చేయించారు. మా చిత్రాన్ని తెలుగులో 500కి పైగా థియేటర్లలో రిలీజ్‌ చేయడం జరిగింది. రిలీజ్ అయిన ప్రతి చోట మంచి ఆధరణ లభించింది. సినిమాను ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు ఈ సినిమాను చూసి సినిమా చాలా బాగుంది. కాని తెలుగులో క్లైమాక్స్‌లో చిన్న మార్పు చేసినట్లయితే సినిమా ఇంకా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది అని సలహా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని దర్శకుడు ఒమర్‌ లులు గారికి చెప్పి నిర్మాతల సహాయంతో క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు రీషూట్‌ చేయడం జరిగింది. రీషూట్‌ సన్నివేశాలు అత్యద్భుతంగా వచ్చాయి. ఈ రీషూట్‌ చేసిన సన్నివేశాలు కలుపుకొని ఫిబ్రవరి 23 నుండి రెండవ వారం అయిన దాదాపు 100 థియేటర్లలో సినిమా ప్రదర్శింపబడుతుంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ సినిమాను తెలుగులో విడుదలచేయడానికి సహకరించిన నా మిత్రుడు మరియు పార్ట్‌నర్‌ సి.హెచ్‌.వినోద్‌రెడ్డి గారిని మరియు సీతారామరాజు, సురేష్‌ వర్మ, దేవేందర్‌ రెడ్డి, శివాజి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 'సఖీభవ సినిమాస్‌' బేనర్‌లో ప్రస్తుతం 'ఉల్లాల ఉల్లాల' పేరుతో ఒక సినిమా నిర్మిస్తున్నాం, 2 డబ్భింగ్‌ చిత్రాలతో పాటు ఒక భారి బడ్జెట్‌ సినిమాను నిర్మిస్తున్నాం'' అన్నారు. 

Recent News